unanimity | సీపీఎస్ పోరాటాన్ని ఉధృతం చేయడమే లక్ష్యం

unanimity | సీపీఎస్ పోరాటాన్ని ఉధృతం చేయడమే లక్ష్యం
- ఆప్టా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా రమాదేవి
- రాష్ట్ర అధ్యక్షుడిగా వి.రమణ, ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్ రెడ్డి నియామకం
unanimity | కర్నూలు, ఆంధ్రప్రభ : మచిలీపట్నంలో గత నెల 30న జరిగిన ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలకమైన తీర్మానాలు చేపట్టారు. ఈ సమావేశంలో భాగంగా ఆప్టా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా గుంటూరు జిల్లా చెరుకుపల్లి(Cherukupalli) మండలం రాంబోట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోషల్ స్టడీస్ స్కూల్(Social Studies School) అసిస్టెంట్ నిడుబ్రోలు రమాదేవిని ఏకగ్రీవంగా నియమించినట్లు ఆప్టా రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది.
అదేవిధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్)కు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయడంతో పాటు, సీపీఎస్ విధానంలో ఉన్న ఉపాధ్యాయులను ఏకతాటిపైకి తెచ్చే(Bringing together) ఉద్దేశంతో ఆప్టా సీపీఎస్ విభాగం రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా నియమించారు. సీపీఎస్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లి గ్రామంలోని ఎంపిపిఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జిటీ(Sgt) ఉపాధ్యాయులు వి.రమణను నియమించారు.
అలాగే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం చిల్లబండ గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జిటీ ఉపాధ్యాయులు ఎం. మధుసూదన్ రెడ్డిని సీపీఎస్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(Chief Secretary of the State)గా నియమించారు. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా తమ తమ విభాగాల్లో ఆప్టా అధికార ప్రతినిధులుగా వారు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, సీపీఎస్ రద్దు లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడమే తమ ప్రధాన కార్యాచరణగా నూతన నేతలు పేర్కొన్నారు.
