వేధింపులు భ‌రించ‌లేకే…

వేధింపులు భ‌రించ‌లేకే…

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో సీజన్ వ్యాపారాలు చేసుకొని కుంటుంబాలు పోషించుకొనే చిరు వ్యాపారులు మున్సిపల్ కమిషనర్ వేధింపులు భరించలేక పట్టణం నుంచి వెళ్ళి పోతున్నారని భారతీయ మాజ్దూర్ సంఘ్(Mazdoor Sangh) మంచిర్యాల జిల్లా కార్యదర్శి మద్దూరి రాజుయాదవ్(Madduri Raju Yadav) అన్నారు.

ఈ రోజు స్థానిక ప్రెస్ క్లబ్ లో సంఘ్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చెన్నూరు పట్టణంలో సీతకాలం ఇతర రాష్టాల నుంచి వచ్చి స్వెట‌ర్లు, దుప్పట్లు అమ్ముకునే వారి స్టాల్‌లను అడ్డుకొని కమిషనర్(Commissioner) పెద్ద మొత్తంలో డబ్బులు అడుగుతూ వేధించడంతో వ్యాపారులు మూట, ముళ్ళే సదురుకొని వెళ్లిపోతున్నారని అన్నారు.

చిరు వ్యాపారులను వేదిస్తూ అక్రమ వసూళ్లు చేసే కమిషనర్ ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజ్దూర్ సంఘ్ నాయకులు విశాల్, జె రమేష్, సమ్మయ్య, శ్రీశైలం, లోక సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply