డీజీపీని కలిసిన టీఅర్ ఎస్‌ పార్టీ నాయకులు

డీజీపీని కలిసిన టీఅర్ ఎస్‌ పార్టీ నాయకులు

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిది, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో కుల వివక్ష చూపుతూ ఆలయానికి వెళ్ళిన వారిపై దాడి చేసి రెండు నెలల చిన్నారిని కాలితో తొక్కి హత్య చేసిన కాంగ్రెస్ సర్పంచ్ అగ్రనాయకులపై వెంటనే కేసు బుక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హైద్రాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ డీజీపీ బి శివదర్ రెడ్డిని కలిసి వినతిపత్రమ్ సమర్పించారు.

ఈ కార్యక్రమంలో బిసి కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్, సీహెచ్ ఉపేందర్, మాజీ ఎంపీపీ రాజు గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి చాకలి ఆనంద్, భరత్ గౌడ్, సుర్వి యాదయ్య మరియు తదితరులు ఉన్నారు.

Leave a Reply