Two key Agents | అద్విక స్కామ్ లో కీలక స్లార్లు

Two key Agents | అద్విక స్కామ్ లో కీలక స్లార్లు
Two key Agents | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : అధిక లాభాల ఆశ చూపిస్తూ డిపాజిటర్ల నుంచి కోట్ల రూపాయలు సేకరించిన అద్విక ట్రేడింగ్ కంపెనీ పెట్టుబడి మోసం కేసులో ఇద్దరు కీలక ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో విజయవాడ టాస్క్ ఫోర్స్ అధికారులు చేపట్టిన దర్యాప్తులో కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. నిందితులను గురువారం అదుపులోకి తీసుకుని, శుక్రవారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు పంపించారు.
Two key Agents | ఏజెంట్ల ద్వారా భారీగా పెట్టుబడులు..
పోలీసుల వివరాల ప్రకారం, అధ్విక ట్రేడింగ్ కంపెనీ పేరుతో నడుస్తున్న పెట్టుబడి వ్యాపారంలో ఏజెంట్లుగా పనిచేసిన ఇద్దరు వ్యక్తులు డిపాజిటర్ల నుంచి భారీగా నిధులు సేకరించారు. విజయవాడకు చెందిన చిలకలపూడి నాగ దుర్గ కళ్యాణ్ చక్రవర్తి ఈ సంస్థలో ఏజెంట్‌గా పనిచేస్తూ సుమారు రూ.5.70 లక్షలు స్వయంగా పెట్టుబడి పెట్టినట్లు వెల్లడైంది. అయితే వడ్డీ, ఏజెంట్ కమిషన్ పేరుతో కలిపి సంస్థ నుంచి మొత్తం రూ.1.02 కోట్లు పొందినట్లు దర్యాప్తులో తేలింది. ఇతని తన తమ్ముడు చిలకలపూడి వీర వెంకట నాగ రాజేంద్ర కుమార్ తో కలిసి తమ పరిచయస్తుల ద్వారా సుమారు 13 మంది.
