Bus fire | దుండగల పనేనా..?

Bus fire | దుండగల పనేనా..?

Bus fire, కేతేపల్లి, ఆంధ్రప్రభ : రాయపురం సెయింట్ ఆన్స్ స్కూల్ బస్సులను గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి సమయంలో తగలబెట్టిన సంఘటన నల్గొండ (Nalgonda) జిల్లా కేతేపల్లి మండలం రాయపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఇట్టి సంఘటన పై పాఠశాల యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. రాయపురం గ్రామంలో సెయింట్ ఆన్స్ స్కూల్ (క్రిస్టియన్ మిషనరీ) కొంత కాలంగా విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ కళాశాల రెండు విద్యాసంస్థలుగా నిర్వహిస్తున్నారు. అయితే.. విద్యార్థులు పాఠశాలకు వివిధ గ్రామాల నుండి విద్యార్థులు రావడానికి బస్సులను ఏర్పాటు చేసారు.

అయితే.. రోజులాగే పాఠశాల ముగిసిన తర్వాత పాఠశాల ఆవరణలో తమకున్న బస్సులను పార్కింగ్ చేశారు. బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో రెండు స్కూల్ బస్సులకు (School Bus) గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి పరారైయ్యారు. ఈ విషయం గమనించిన యాజమాన్యం మంటలు అర్పించే ప్రయత్నం చేసినప్పటికీ వీలుకాకపోవడంతో ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ వచ్చేసరికి రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ విషయం పై పోలీస్ లకు పిర్యాదు చేసి నిప్పు అంటించిన దుండగులను పట్టుకుని శిక్షించాలని పాఠశాల యాజమాన్యం కోరారు.

Leave a Reply