తాంసి, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ) : మండలంలోని లింగుగూడ గ్రామానికి చెందిన ఆత్రం దేవ్ రావు, టేకం బర్కత్ రావు అనే ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చిన అక్రమ దేశిదారు విక్రయిస్తుండడంతో బుధవారం రాత్రి దాడి చేసి పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. వారి వద్ద నుండి 10వేల రూపాయల విలువ గల 280 బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది ఉన్నారు.
ADB | నాటుసారా అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్
