- మూలమలుపు వద్ద పిచ్చి మొక్కలు
- పిచ్చి మొక్కలను తొలగించాలి
- సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి
- అధికారుల స్పందించాలి
టేకుమట్ల, ఆంధ్రప్రభ : వాహనదారులకు, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి రహదారులను(roads) నిర్మిస్తుంది. కానీ అధికారుల నిర్లక్ష్యం వలన నిత్యం ప్రమాదాల బారిన వాహనదారులు, ప్రయాణికులు పడుతున్నారు.
మండలంలోని రాఘవరెడ్డి పేట వెలంపల్లి, పంగిడి పల్లి తదితర గ్రామాల్లో ఉన్న ప్రధాన మూల మలుపుల వద్ద సూచిక బోర్డ్(signboards) లు లేకపోవడంతో నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. మూల మలుపుల వద్ద చెట్లు పెరగడంతో అటుగా వచ్చే వాహనాలు సైతం కనిపించడం లేదు. ప్రధాన మూలమలుపులో హెచ్చరిక బోర్డు లేక వాహనదారులు(motorists) అటుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు.
కొందరు గాయాలపాలవుతున్నారు. మరి కొంతమంది వికలాంగులుగా మారి తన జీవితాలని కోల్పోతున్నారు. కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం(accident) బారిన పడుతున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మూలమలుపుల వద్ద సూచిక లేదా హెచ్చరిక బోర్డులను నెలకొల్పాలని ప్రజలు కోరుతున్నారు.
సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలి.. బొజ్జ పెళ్లి ప్రభాకర్
గ్రామీణ ప్రాంతాల్లోని మలుపుల వద్ద సూచిక బోర్డులు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికితోడు రోడ్డు పక్కన పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో ఎదురుగా ఏ వాహనం వస్తుందో గుర్తించడం కష్టమవుతుంది. ఆర్అండ్ అధికారులు స్పందించి మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేసి చెట్ల పొదలను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

