పసుపు రైతుల ఆందోళన

పసుపు రైతుల ఆందోళన

నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతుల పరేషాన్!
పసుపు కొనుగోళ్లలో సాంకేతిక సమస్యలు..
రెండు రోజులుగా కొనుగోలు బంద్..
మార్కెట్ యార్డ్ కార్యాలయ ముట్టడించిన రైతులు
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు

నిజామాబాద్,ఆంధ్రప్రభ : కష్టపడి పండించిన పసు పు ను మార్కెట్ యార్డ్ కు తీసుకొచ్చి రెండు రోజులు అవుతున్న ఇప్పటివరకు సాంకేతిక సమస్యల సాకుతో పసుపు కొనుగో లు చేయడం లేదని రైతు లు మండిపడ్డారు. ఇంకెన్ని రోజులు ఎదురుచూ పు లు… పసుపుని కొను గోలు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు. గురువా రం నిజామాబాద్ నగరం లోని మార్కెట్ యార్డులో వ్యవసాయ మార్కెట్ కమి టీ కార్యాలయాన్ని పసుపు రైతులు ముట్టడి చేశారు. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా పసుపు రైతు లు మార్కెట్ కమిటీ కార్యా లయం లోపలికి చొచ్చు కొని వెళ్లి ఆందోళన చేపట్టారు. మాకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అధికారులను నిలదీశారు.

ఇంకెన్ని రోజులు మేము ఎదురు చూడాలి. పసుపును అసలు మీరు కొనుగోలు చేసేది ఎప్పు డు అంటూ… మా బాధలు మీకు పట్టవా అంటూ అధికారులను ప్రశ్నించారు. మాకు సమాధానం చెప్పి తీరా ల్సిందే నంటూ మొండికేశారు. ఒకసా రిగా రైతులు మార్కె ట్ యార్డు కార్యా లయం లోప లికి చొ చ్చుకొని పోయి వెళ్ళే క్రమంలో డోర్ అద్దా లు పగిలిపోయాయి. దీంతో కొంత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేలా పోలీసులు రైతులను శాంతిం పజేసి సముదాయించారు.

ఈ నామ్ 2.0 లో సాంకే తిక సమస్యల కారణం గానే పసుపు కొను గోలు చేయలేకపోయామని దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండని మార్కెట్ కమిటీ కార్యదర్శి అధికా రులు తెలిపారు. కొనుగోళ్ల కు సంబంధించి పాత పద్ధతిలో కాకుండా.. కొత్త పద్ధతిన ఈ నామ్ 2.o వచ్చింది. ఈ పద్ధతిలో కొంతవరకు సాంకేతిక సమస్యలు రావడంతోనే పసుపు కొనుగోలు చేయలే కపోయామని అధికారులు రైతులకు చెప్పారు. ప్రస్తు త పరిస్థితుల్లో తాత్కాలి కంగా ఆన్లైన్ ప్రక్రియలో కాకుండా మ్యానువల్ గా పసుపు కొనుగోలు చేస్తా మని అధికారులు రైతు లకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Leave a Reply