తుంగ‌భ‌ద్ర ముంచేసింది !

తుంగ‌భ‌ద్ర ముంచేసింది !

మంత్రాలయం, ఆంధ్ర ప్రభ : తుంగభద్రా నది(Tungabhadra river)లో విషాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామానికి చెందిన వీరేంద్ర (22) నది ఒడ్డున స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు లోతట్టు ప్రాంతంలోకి వెళ్లి ఒడ్డుకు చేరుకోలేక మునిగిపోయాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

వీరేంద్ర(Virendra) నదిలో స్నానం చేస్తున్న సమయంలోనే నీటి ప్రవాహం పెరగడంతో నియంత్రణ కోల్పోయి గల్లంతయ్యాడని, వెంటనే సమాచారం అందుకున్న స్థానికులు గాలింపు చర్యలు చేపట్టినా, అప్పటికే అతను మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply