- తులసికి పూజలు చేస్తున్న మాజీ ఎంపీపీ దంపతులు
ఉట్నూర్, (ఆంధ్రప్రభ): కార్తీక మాసం సందర్భంగా అదిలాబాద్, కొమరం భీం-ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో భక్తిశ్రద్ధలతో తులసి కళ్యాణ వేడుకలు నిర్వహించారు. గత రెండు రోజులుగా మహిళలు, దంపతులు స్థానిక దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు.
మంగళవారం రాత్రి పలు గ్రామాల్లో తులసి కళ్యాణ వేడుకలు అత్యంత భక్తి భావంతో జరిగాయి. ఉట్నూర్ సమీపంలోని ఘన్పూర్ గ్రామంలో మాజీ ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, ఘన్పూర్ సర్పంచ్ పంద్ర లత దంపతులు తమ నివాసంలో తులసి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తూ, కార్తీక దీపాలతో ఆవరణాన్ని అలంకరించి భక్తిపర వాతావరణాన్ని నెలకొల్పారు.

