మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..
- మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్
తొర్రూరు, ఆంధ్రప్రభ : మహిళలు అన్ని రంగాల్లో రాణించటం కృషి చేయాలని తోరూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్ అన్నారు. ఐఎల్ఎస్ఐ రాధిక రాకేష్ ట్యూషన్‌లో ఆదివారం రాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ట్యూషన్ నిర్వాహకురాలు రాధిక రాకేష్ ఎనమాలతో కలిసి విద్యార్థుల మాతృమూర్తులను ఘనంగా సన్మానించారు. అనంతరం రజిని రాజశేఖర్ మాట్లాడుతూ పాఠశాల ముగిసిన అనంతరం ట్యూషన్ సెంటర్లలో విద్యనభ్యసించి అభివృద్ధి చెందాలని కోరారు.
విద్యార్థుల ఉన్నతికి ట్యూషన్ సెంటర్లు ఎంతగానో తోడ్పడుతాయని తెలిపారు.పిల్లలు క్రమశిక్షణతో పాటు ఆటపాటల ద్వారా మంచి గ్రామర్ నైపుణ్యాలు, మంచి విలువలు నేర్చుకుంటూ భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉష చౌదరి, సరోజన ,రంగు, శ్రీదేవి , స్పందన, స్వాతి, కమల, మంగు, హేమ, సంగీత, బబ్రీదేవి, దాడిని విద్యార్థునీలు ఆయుష్మతి టి.ఆద్య వైష్ణవి, సహస్ర, వి.ఆద్య,ఆయుక్తశ్రీ, కవిత శశిరా, తరుణి హరిని, రజాల్, శివాని, జోష్నా తదితరులు పాల్గొన్నారు.
