TTD | ధర్మకర్తల మండలి సమావేశం..

TTD | ధర్మకర్తల మండలి సమావేశం..
ఆంధ్రప్రభ వెడ్ డెస్క్ : టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం తిరుమలలో మంగళవారం జరగనుంది. బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సభ్యులు దాదాపు 60 అంశాలతో రూపొందించిన అజెండా పై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు జరుగనున్న వైకుంఠ ద్వార దర్శ నాలు, చేపట్టాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంజినీరింగ్ పనులకు నిధుల కేటాయింపు పై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
కాటేజీ దాతల ప్రయోజనాలు, నిర్వహణ వంటి అంశాలు, శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆలయాల నిర్మాణాలకు సమగ్ర విధి విధానాల రూపకల్పన, నిధుల మంజూరు వంటి అంశాల పై తీర్మానాలు చేయనున్నారు. వంద ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్ట్ కు బోర్డు ఆమోదం తెలపనుంది. పదేళ్ల క్రితం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైన తిరుమలకు రోప్ వే అంశం పైనా చర్చించనున్నట్టు సమాచారం.
