Trust | చేయూత ట్రస్ట్ సేవలకు సలాం…

Trust | చేయూత ట్రస్ట్ సేవలకు సలాం…
- నిరుపేదలకు చేయూత ట్రస్ట్ అండ…
- పుట్టి నరసింహారావుకి ఆర్థిక చేయూత అందజేత..
Trust | భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : నిరుపేద కుటుంబాలకు చేయూత ట్రస్ట్ అండగా నిలబడుతుందని ట్రస్ట్ గౌరవాధ్యక్షులు కె వెంకటేశ్వర్లు(కేవీ) అన్నారు. బూర్గంపాడు మండలం మొరం పల్లి బంజరు గ్రామానికి చెందిన పుట్టి నరసింహారావుకు ఈ రోజు బంజరు గ్రామానికి చెందిన చేయూత ట్రస్ట్ వారు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పుట్టి నరసింహారావు జీవనోపాధి కోసం తాపీ పని నిమిత్తం హైదరాబాదులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గత వారం రోజుల క్రితం అనుకోకుండా ప్రమాదం జరగడంతో ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిపోయాయి. కుటుంబ సభ్యులు క్షేతగాత్రుడిని భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ కింద అడ్మిషన్ చేయించి వైద్యం అందిస్తున్నారు. నిరుపేద కుటుంబం కావడంతో పూట గడవడానికి ఇబ్బంది పడుతున్న వేళ కనీసం ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో చేయూత ట్రస్టు వారిని సహాయం అడగడంతో వెంటనే స్పందించిన చేయూత ట్రస్టు ఈ రోజు మూడువేల రూపాయలను భద్రాచలం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రుడికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు కే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి చేయూత ట్రస్టు ఎన్నో నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా విద్య వైద్య రంగాలలో ప్రధానంగా నిరుపేద కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తూ సేవలందిస్తుందని మానవసేవే మాధవ సేవ అనే పదానికి భావం చెప్తూ అభాగ్యులకు అండగా నిలబడుతుందని అన్నారు. భవిష్యత్తులో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవటానికి ఒక గ్రంథాలయాన్ని మొరంపల్లి బంజరు బస్టాండ్ ప్రాంతంలో ప్రారంభించిన ఉన్నట్లు తెలిపారు. ట్రస్టు కుటుంబ సభ్యుల సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రధాన కార్యదర్శి జెక్కిరెడ్డి మల్లారెడ్డి, కోశాధికారి పుట్టి రాజేష్, ట్రస్ట్ కుటుంబ సభ్యులు సెనగ మల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
