Trump Warning | ప‌ద్ధ‌తి మార్చుకోక‌పోతే వెనెజువెలా ప‌రిస్థితి

Trump Warning | ప‌ద్ధ‌తి మార్చుకోక‌పోతే వెనెజువెలా ప‌రిస్థితి

  • మాద‌క ద్ర‌వ్యాల స‌ర‌ఫ‌రా చేస్తున్న దేశాలు ఖ‌బద్దార్‌
  • అప్ర‌మ‌త్త‌మైన కొలంబియా
  • అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వార్నింగ్‌

Trump Warning | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : వెనెజువెలా దేశంపై అమెరికా పాల్ప‌డిన ఈ చ‌ర్య‌తో ఆ దేశ ప్ర‌త్య‌ర్థి దేశాలు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డాయి. ప్ర‌ధానంగా మూడు దేశాల‌కు అమెరికా నుంచి ముప్పు ఉంటుంద‌ని అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. అమెరికాకు మాద‌క ద్ర‌వ్యాలు స‌ర‌ఫ‌రా చేస్తున్న దేశాల‌పై ఉక్కుపాదం మోప‌డానికి అమెరికా వెనుకంజ వేయ‌డం లేద‌ని సంకేత‌లు ఇచ్చింది. అందులో భాగంగా వెనెజువెలా పై అమెరికా చేసిన దాడి అని చెప్ప‌వ‌చ్చు. అంత‌ర్గ‌తంగా ఏ కార‌ణాలు ఉన్నా ప్ర‌స్తుతానికి మాద‌క‌ద్ర‌వ్యాలు స‌ర‌ఫ‌రాయే ప్ర‌ధాన కార‌ణంగా అమెరికా చూపుతోంది. నెక్ట్స్ టార్గెట్ కొలంబియాపై ఉంటుంద‌ని ఆ దేశం అప్ర‌మ‌త్త‌మైంది.

Trump Warning ట్రంప్ వార్నింగ్‌…

వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించిన అనంతరం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి దేశాలను హెచ్చరించారు. ఇప్పటికైనా ప‌ద్ధ‌తి మార్చుకోకపోతే తర్వాత వెనెజువెలా పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇతర దేశాల నుంచి అమెరికాకు సరఫరా అవుతున్న డ్రగ్స్ ను కట్టడి చేయడం, అమెరికాలోకి అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌ను అడ్డుకోవ‌డం, ఉగ్ర‌వాద చ‌ర్య‌లు లేకుండా చేయ‌డ‌మే అంతిమ ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికైనా ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని లాటిన్ అమెరికాలో అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌టించారు.

Trump Warning మూడు దేశాల‌పై ట్రంప్ ఆగ్ర‌హం

డ్రగ్స్‌ తయారీ, మాదక ద్రవ్యాల ముఠాలకు క్యూబా, మెక్సికో, కొలంబియా దేశాలు ఆశ్రయమిస్తున్నాయని, అక్కడి నుంచి అమెరికాలోకి అక్రమంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కారణంతో వెనెజువెలాపై సైనిక చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆయా దేశాల్లోని డ్రగ్స్‌ ఉత్పత్తి ల్యాబ్‌లపై దాడులు చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.

Trump Warning నెక్ట్స్.. కొలంబియా?

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉద్దేశం ప్ర‌కారం కొలంబియాపై దాడి చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు భావించొచ్చు. ముఖ్యంగా కొలంబియాపై ట్రంప్‌ తీవ్ర విమర్శలు చేశారు. కొలంబియాలో మూడు ప్రధాన కొకైన్‌ తయారీ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. వాళ్లే కొకైన్‌ను తయారు చేసి, అమెరికాకు పంపిస్తున్నారని అందుకే జాగ్రత్తగా ఉండాలంటూ కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను ఉద్దేశించి హెచ్చరించారు. ట్రంప్‌ చర్యలతో తాము కూడా అప్రమత్తమయ్యామని.. వెనెజువెలా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తున్నామని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు.

CLICK HERE TO READ అమెరికా బాట‌లో కెన‌డా

CLICK HERE TO READ MORE

Leave a Reply