Trump|H-1B Visa|Tariff ట్రంప్ పై అమెరికాలో వ్యతిరేక గళం!
- భారత్‌పై ఆ టారిఫ్‌లు అక్రమమని చట్టసభ ప్రతినిధులు తీర్మానం
- హెచ్-1బీ ఫీజు పెంపుపై కోర్టును ఆశ్రయించిన అమెరికా రాష్ట్రాలు
Trump|H-1B Visa|Tariff వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఆ దేశంలోనే వ్యతిరేక గళం వినిపిస్తోంది. ప్రధానంగా ఇండియాపై టారిఫ్‌లు వేయడం, హెచ్-1బీ ఫీజు పెంపుపై అక్కడ రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతుంది. దీనిపై గతంలో ముగ్గురు చట్టసభ ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడికి లేఖ రాశారు. టారిఫ్‌లను వ్యతిరేకిస్తూ ఏకంగా తీర్మానం చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెంచిన హెచ్-1బీ వీసా ఫీజు(H-1B Visa Fee)ను అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కాలిఫోర్నియాతోపాటు 19 రాష్ట్రాలు ట్రంప్ దేశాలకు వ్యతిరేకంగా పరిహారం కేసులు వేశాయి. హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడాన్ని ఆయా రాష్ట్రాలు వ్యతిరేకించాయి. తాజాగా బోస్టన్ కోర్టులో కేసు వేశారు. ఆ ఫీజుకు వ్యతిరేకంగా ఇప్పటికే బోస్టన్ కోర్టులో మూడు కేసులు దాఖలయ్యాయి.
Trump|H-1B Visa|Tariff ఫీజును పెంచే అధికారం ఉభయ సభలదే!
ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించి వీసా ఫీజును పెంచినట్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ వాదించారు. ఆదాయం రాబట్టేందుకు దేశాధ్యక్షుడు ఏకపక్షంగా ఛార్జీలను పెంచడం అమెరికా రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. ఫీజును పెంచే అధికారం అమెరికా ఉభయసభల వద్ద ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. రూ.లక్ష ఫీజు వసూలు చేయడంతో కంపెనీలపై ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులకు నిత్యావసర సర్వీసులను అందించడం కష్టం అవుతుందని, విద్యా, ఆరోగ్యం లాంటివి కూడా సమస్యాత్మకం అవుతాయని తెలిపారు. కాలిఫోర్నియాతో పాటు న్యూయార్క్, మాసాచుసెట్స్, ఇలియనాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్ రాష్ట్రాలు కూడా కోర్టులో సవాల్ చేశాయి.

Trump|H-1B Visa|Tariff భారత్, బ్రెజిల్ దేశాలపై అదనపు సుంకాలు ఎత్తివేయాలి
భారత్‌పై అదనంగా 50 సుంకాలను విధిస్తూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎత్తుగడను హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు చెందిన ముగ్గురు ప్రతినిధులు వ్యతిరేకించిన సంగతి విదితమే. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్లు తీర్మానం చేశారు. ఇండియాపై అదనపు సుంకాన్ని విధించడం అక్రమం అని పేర్కొన్నారు. అమెరికా వర్కర్లు, వినియోగదారులు, ద్వైపాక్షిక సంబంధాలకు ఇది హానికరమైందని చట్ట సభ ప్రతినిధులు డిబోరా రాస్, మార్క్ వీసే, రాజా కృష్ణమూర్తి ఆరోపించారు. ఈ మేరకు తీర్మానం కూడా చేశారు. భారత్‌తో పాటు బ్రెజిల్ దేశాలపై విధించిన అదనపు సుంకాలను ఎత్తవేయాలని చట్టసభ ప్రతినిధులు తమ తీర్మానంలో కోరారు. భారత్‌పై అదనంగా 25 శాతం సుంకాన్ని విధించారని, దాన్ని ఎత్తివేయాలని కోరుతూ చట్టసభప్రతినిధులు తమ తీర్మానంలో డిమాండ్ చేశారు.

