Trump | Venezuela | నేనే అధ్యక్షుడిని!

Trump | Venezuela | నేనే అధ్యక్షుడిని!

  • ట్రంప్ పోస్టు ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది
  • ఇదేదో అమెరికా కోసం కాదు.. వెనెజువెలా కోసం!
  • వెనెజువెలా అధ్య‌క్షుడ‌ని నేనే అని ప్ర‌క‌టించుకున్న ట్రంప్‌

వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : అగ్ర‌రాజ్య అధినేత‌.. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏమి మాట్లాడుతారో ఎవ‌రికి అంతుప‌ట్ట‌డం లేదు. ప్రపంచ రాజకీయ చిత్రపటంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ రోజు ట్రూత్ సోష‌ల్ మీడియాలో ట్రంప్ పోస్టు చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌ప‌డ్డారు. వెనెజువెలా అధ్య‌క్షుడ‌ని తానే అని ట్రంప్ ప్ర‌క‌టించుకున్నారు.

అయితే ఇత‌ర దేశాల విష‌యంలో ట్రంప్ ఎన్నో అబ‌ద్దాలు చెబుతుంటారు. ప్ర‌ధానంగా ఇండియా-పాకిస్తాన్ యుద్ధం తానే ఆపిన‌ట్లు ప్ర‌పంచానికి ట్రంప్‌ చాటుకున్నారు. అయితే ఇండియా ప్ర‌భుత్వం అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌డంతో ట్రంప్ కంగుతిన్నారు. వెనిజులాలో నెలకొన్న అనిశ్చితి మధ్య ఏకంగా తనను తానే ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకుని ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచారు.

వెనెజువెలా పూర్తి స్థాయి నేత ఎవ‌రు?
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే నెపంతో అమెరికా బలగాలు ఇటీవల వెనెజువెలా రాజధాని కారకాస్‌పై మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుని వాషింగ్టన్‌కు తరలించిన‌ సంగ‌తి తెలిసిందే.

మదురో నిర్బంధం తర్వాత వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె 90 రోజుల పాటు అధికారంలో ఉంటారని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. అయితే వెనెజువెలా తదుపరి పూర్తిస్థాయి నాయకుడు ఎవరనే దానిపై సందిగ్ధం కొనసాగుతోంది.
‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍
పోస్టింగ్ వివ‌రాలు ఇలా…
వికీపీడియా పేజిని పోలినట్లుగా ఉన్న ఎడిటెడ్ ఫొటోను ట్రంప్ పోస్టు చేశారు. అందులో డోనాల్డ్ ట్రంప్ ఫొటో కింద వెనెజువెలా యాక్టింగ్ ప్రెసిడెంట్ అని రాసి ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్లుగా ఉంది.

ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సైనిక చర్య అనంతరం వెనెజువెలాలో సేఫ్‌గా ఉండేంత వరకు తామే ప్రభుత్వాన్ని నడిపిస్తామని ట్రంప్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత వెనక్కి తగ్గారు. దీంతో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న డెల్సీ రెడ్రిగ్జో యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు.

అయితే ఆమె తమకు నచ్చినట్లుగా వ్యవహరించాలని.. లేదంటే మదురో కంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అప్పట్లో ట్రంప్ హెచ్చరించారు. అమెరికా, వెనెజువెలా ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ పోస్టు రాజకీయంగా సంచలనంగా మారింది.

click here to read అమెరికా ఆయిల్​ కాలనీ

click here to read more

Leave a Reply