టీఆర్ఎస్.. బీజేపీ ఒక తాను ముక్కలే..
జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti SrinivasReddy) పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలోని ఎస్.పి.ఆర్ హిల్స్ ప్రాంతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వంద మంది మైనార్టీ యువకులు చేరారు. వారందరికీ కండువాలు కప్పి ఆహ్వానించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికలు అయ్యాక ఈ నియోజకవర్గానికి వస్తానని ఇక్కడ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అంబేద్కర్ స్టడీ సర్కిల్ (Ambedkar Study Circle) లో కోటి రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేస్తామని అందరికీ అందుబాటులోకి తెస్తామని ఆయన తెలియచేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గాన్ని దోచుకుతిన్న టీఆర్ఎస్ కు ఓట్ల అడిగే హక్కు లేదని.. టీఆర్ఎస్ బీజేపీ ఒక తాను ముక్కలే అని, గత పార్లమెంటు ఎన్నికల నుంచి వాటి మధ్య పొత్తు ఉందన్నారు. అలాగే టీఆర్ఎస్ మాజీ మంత్రులు భాష సంస్కరించుకోవాలని మంత్రి పొంగులేటి అన్నారు.

