మండలి వెంకటకృష్ణారావుకు ఘన నివాళులు..

కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు ప్రధాన సెంటర్లో ఆగస్టు 4వ తేదీ నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలలో భాగంగా శనివారం అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట కనకదుర్గ ముఖ్య అతిథిగా పాల్గొని మండలి వెంకటకృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తోట కనకదుర్గ మాట్లాడుతూ 1977 లో దివిసీమ ఉప్పెనతో అల్లాడుతున్న సమయంలో ఢిల్లీ నాయకుల సైతం గల్లీకి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు మన మండలి వెంకట కృష్ణారావు అని అన్నారు. తెలుగు భాష మహాసభలను ప్రపంచానికి తొలిసారిగా పరిచయం చేసిన నాయకుడు మండలి అన్నారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి మండలం జనసేన పార్టీ వీర మహిళ బడే నాగమణి, పిఎసిఎస్ చైర్మన్లు, కోడూరు మండలం జనసేన, తెలుగుదేశం పార్టీలా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
