Mahatma | జ్యోతిబా పూలేకు ఘ‌న నివాళులు

Mahatma | జ్యోతిబా పూలేకు ఘ‌న నివాళులు

Mahatma | అచ్చంపేట , ఆంధ్ర‌ప్ర‌భ : మ‌హాత్మ జ్యోతిరావు పూలే వ‌ర్దంతి సంద‌ర్భంగా ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఈ రోజు అచ్చంపేట పట్టణంలో బీఎస్పీ కార్యాలయంలో (At the BSP office) జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఉల్పర కృపానందం అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూల్ జిల్లా ఇన్‌చార్జ్ భీమసోళ్ల యోసెఫ్ హాజరై, మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూల మాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రగంటి రామన్న, పార్టీ నాయకులు కుందేటి రవి, భీంపాకుల నాగేశ్, కాంపల్లి అంజనేయులు, సుప్రీం తదితరులు పాల్గొన్నారు.

న‌ల్ల‌బెల్లిలో…


నల్లబెల్లి , ఆంధ్ర‌ప్ర‌భ : జ్యోతిరావు పూలే (Jyotirao Phule) ఆశయాలను సాధించాలంటే బహుజనులు రాజ్యాధికారంలోకి రావాల‌ని, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధానకార్యదర్శి చింతకింది కుమారస్వామి అన్నారు. నల్లబెల్లిలో గ్రామ పంచాయతీ ఆవరణలో జ్యోతి రావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘ‌న నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పరికి కోర్నేలు, బొట్ల ప్రతాప్, నాగెల్లి ప్రకాష్, సీపీఐ మండల కార్యదర్శి కడియాల క్రాంతి కుమార్, కన్కం ఎల్లయ్య, కాంగ్రెస్ నాయకులు కొండి అశోక్, పొడేటి కిశోర్‌, సామేల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply