వీర శివాజీ ఆశయ సాధనలో ముందడుగు వేద్దాం..

పరకాల, ఆంధ్రప్రభ : దేశ భక్తికి, ధైర్యసాహసాలకు మారుపేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని, వీర శివాజీ ఆశయ సాధనలో ముందడుగు వేద్దామని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కాళీ ప్రసాద్ రావు అన్నారు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, ధీరత్వానికి నిలువెత్తు నిదర్శనం ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశం కోసం, ధర్మం కోసం ఆయన చేసిన పోరాటం అజరామరం అని కొనియాడరు. హిందూ స్వరాజ్య స్థాపకుడు, ధర్మ రక్షకుడు, అఖండ భారత వీర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు అని, ఆయన చూపిన ధైర్యం, పరిపాలనా దక్షత నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆ వీర శివాజీ ఆశయ సాధనలో ముందడుగు వేద్దామని డాక్టర్ కాళీ ప్రసాద్ అన్నారు.

Leave a Reply