Tributes | మహాత్మునికి నివాళి

Tributes | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సీఐ యాలాద్రి, గాంధీ విగ్రహ వ్యవస్థాపకులు చింతకింది రామానుజం, స్థానికులు చొల్లేటి నాగేశ్వర్, పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
