Tributes | విలపించిన కళా..

Tributes | విలపించిన కళా..

  • అప్పల సూర్యనారాయణకు అశ్రునయనాలతో నివాళులు

Tributes | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి తో దిగ్భ్రాంతి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఈ రోజు అప్పలసూర్య నారాయణ భౌతికకాయాన్ని చూసి తనకు చిరకాల మిత్రుడైన అప్పల సూర్యనారాయణ నిస్వార్ధ రాజకీయ జీవితం గడిపారని అటువంటి వ్యక్తి మరణం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని చెబుతూ బోరున విలపించారు. అనంతరం ఆయన అప్పలసూర్యనారాయణ సతీమణి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని పరామర్శించి ఓదార్చారు.

విజయనగరం ఎంపీ కలిశెట్టి సంతాపం : మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ మృతి పట్ల విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర సంతాపం తెలియజేశారు. ఈ రోజు ఉదయాన్నే అరసవిల్లిలోని అప్పల సూర్యనారాయణ స్వగృహంకు చేరుకున్న ఎంపీ గుండ మృదేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు.

ఆయన కుమారులను, భార్య గుండ లక్ష్మీదేవిని అప్పలనాయుడు ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిజాయితీతో కూడిన రాజకీయాలు చేసి, నాలుగు సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైన అప్పల సూర్య నారాయణ నేటి తరానికి మార్గదర్శకులని కొనియాడుతూ నివాళులర్పించారు.

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, వైసీపీ నాయకులు తమ్మినేని వెంకట్ శ్రీరామ్ చిరంజీవి నాగ్, శాసనసభ్యులు నడికుదిటీ ఈశ్వరరావు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, బీజేపీ నాయకులు పైడి వేణుగోపాలం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అన్నాజీ రావు, పలువు రాజకీయ నాయకులు అభిమానులు వేలాదిగా గుండ స్వగృహానికి వెళ్లి ఆయన భౌతికఖాయంపై పుష్ప గుచ్చాలనుంచి నివాళులర్పించారు నివాళులర్పించారు.

Leave a Reply