Tributes | ఘన నివాళులు

Tributes | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటశాలలో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమర్ధ ట్రైనింగ్ సెంటర్లో ఈ రోజు సావిత్రిబాయి పూలే 196వ జయంతి, మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందె జగదీష్, మాజీ ఎంపీపీ అందె సూర్యభవాని ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
సూర్యభవాని మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో చదువు నేర్చుకుని తనలాగా చదువుకు దూరమైన ఎంతోమంది మహిళలకు చదువు నేర్పి భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా, సంఘ సంస్కర్తగా పేరు పొందారని కొనియాడారు. మహిళలను ఆమె ఎంతగానో ప్రోత్సహించారన్నారు. సావిత్రిబాయి పూలే మహిళలకు చేసిన సేవలను జగదీష్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత మహిళలు పాల్గొన్నారు.
