Tributes | మృతురాలి కుటుంబానికి పరామర్శ
Tributes | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు మల్లారెడ్డి పల్లె కాలనీకి చెందిన పంచగిరి సంపత్ తల్లి లక్ష్మీ అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న 17వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ పాలకుర్తి గోపి పంచగిరి మృతురాలి ఇంటికి వెళ్లారు. లక్ష్మి భౌతికకాయం వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ చందుపట్ల నరసింహారెడ్డి, నాయకులు మహమ్మద్ అల్తాఫ్, రాయబారపు అనిల్, నూగురి సారంగపాణి, గాదె విజేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

