Tributes | వంగవీటికి నివాళి

Tributes | బంటుమిల్లి, ఆంధ్రప్రభ : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా బంటుమిల్లి లక్ష్మీపురం సెంటర్‌లో ఆయ‌న చిత్రపటానికి పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బంటుమిల్లి మండలం ముళ్లపర్రు గ్రామంలో వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Tributes

Leave a Reply