విశ్రాంత ఉద్యోగి గోద్రుకు నివాళి..

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పోచంలొద్ది గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి కుడ్మెత గోద్రు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, జై నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాత్ రావు,నాయకులు ఆదివారం వారి నివాసానికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గోద్రు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోద్రు చేసిన సేవలు గ్రామానికిగుర్తుండిపోతాయని డిసిసి, చైర్మన్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆమె ధైర్యం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ చేర్మెన్ విశ్వనాత్ రావు ,జైనూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముఖిద్,పోచంలోద్ది సర్పంచ్ మడవి మనోహర్,నాయకులు ఆత్రం శేషుపాల్, పెందూర్ అర్జున్, పెందూర్ ప్రకాష్, జమిల్,రషీద్,రహీమ్, అబ్దుల్,నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
