పోలీసు అమరవీరులకు నివాళి
- పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కలెక్టర్ వినోద్‌కుమార్
- పోలీస్ అమరవీరుల రోల్ ఆఫ్ ఆనర్ పుస్తక్ ట్రోలిని అందుకున్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
- అమర్ జవాన్ స్తూపం వద్ద రీత్ తో పోలీస్ అమరవీరులకు నివాళులర్పిస్తున్న కలెక్టర్
- గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్
- జండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తున్న కలెక్టర్
- ప్రజల శాంతి భద్రతల పరిరక్షణకు 24/7 పోలీస్ సేవలు : జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్
బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : పోలీసు అమరవీరుల త్యాగం వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్(Vinod Kumar) అన్నారు. మంగళవారం, బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్, అమర జవాన్ స్థుపం వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై, గౌరవ వందనం స్వీకరించారు. అమరులైన పోలీస్ వారి వివరాలతో కూడిన రోల్ ఆఫ్ ఆనర్ పుస్తక్ ట్రోలి(Roll of Honor Pustak Troli) ని కలెక్టర్ వినోద్ కుమార్ విజయ సారధికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకునే రోజని ఆయన తెలిపారు.ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన, దేశమంతా వీర పోలీస్ సిబ్బందికి గౌరవంగా నమస్కరిస్తుందన్నారు. పోలీస్ వారి ధైర్యం, త్యాగం, కర్తవ్య నిబద్ధత వల్లే మన సమాజం నేడు శాంతి, భద్రతలతో జీవిస్తోందన్నారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మావోయిస్టులు, ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులతో పాటు విధి నిర్వహణలో భాగంగా అల్లర్లు, అలజడుల్లో కీలక విధులు నిర్వహించి ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ నివాళులు అర్పించేందుకు స్మృతి పెరేడ్ నిర్వహించి అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని తెలిపారు. పోలీస్ శాఖ విధులు(Police Department Duties) ఎంతో భిన్నంగా ఉంటాయని, పగలు రాత్రి తేడా లేకుండా, ఎండా,వాన లెక్కచేయకుండా శాంతి భద్రత,ప్రజల హక్కుల పరిరక్షణ కోసం 24/7 నిరంతరంగా సేవలందించేది పోలీస్ వ్యవస్థ మాత్రమేనని ఆయన తెలిపారు. పోలీస్ స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్చాలను సమర్పించి వీర జవాన్లకు నివాళులు అర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు, బహుమతులు అందించారు. అనంతరం అమర్ జవాన్ స్థూపంAmar Jawan Stupam) నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించే ర్యాలీని కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. బాపట్ల శాసనసభ్యులు వేగేశిన నరేంద్ర వర్మ రాజు, బాపట్ల టౌన్ డిఎస్పి రామాంజనేయులు, రేపల్లె డిఎస్పి శ్రీనివాసరావు, చీరాల డీఎస్పీ మోయిన్(Cheerala DSP Moin), బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి పి గ్లోరియా, తహసిల్దార్ సలీమా పోలీస్ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
