Tribute | పుల్వామా అమరవీరులకు పేరూరులో దీపాల నివాళి…

Tribute | పుల్వామా అమరవీరులకు పేరూరులో దీపాల నివాళి…

జోహార్ నినాదాలతో మారుమోగిన గ్రామం

Tribute | మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ: పుల్వామా ఉగ్రవాది దాడిలో అమరులైన భారత జవాన్లకు నివాళిగా కౌకుంట్ల మండలం పేరూరు గ్రామంలో గ్రామ పెద్దలు, యువకులు కలిసి గ్రామ రచ్చ బండ వద్ద కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల చిత్రపటాల ముందు దీపాలు వెలిగించి పుష్పాంజలి అర్పించిన అనంతరం, వారి త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా “జోహార్ అమరవీరులకు… జోహార్ జోహార్” అంటూ యువత నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల త్యాగం చిరస్మరణీయమని, వారి స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరవీరులకు తమ గౌరవాన్ని తెలియజేశారు.

Leave a Reply