Tribute | వర్నిలో ఎన్టీఆర్ వర్ధంతి

Tribute | వర్నిలో ఎన్టీఆర్ వర్ధంతి
Tribute | వర్ని, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని ఇవాళ వర్ని మండల కేంద్రంలో నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల వారికి ముఖ్యమంత్రిగా అయన చేసిన సేవలను కొనియాడారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని అమలు చేయడం ద్వారా పేదల ఆకలి తీర్చడం జరిగిందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు రాజకీయ ఛైతన్యం ఎన్టీఆర్ ద్వారానే వచ్చిందన్నారు. మహిళలకు ఆస్తి హక్కు, రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం ఆయనతోనే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనకదుర్గ రవి, నాగేశ్వరావు, గణపతి, రెడ్డి రాజు, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
