Tribute | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : అమరజీవి పొట్టిశ్రీరాములుకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్ వివేకనంద కార్యాలయం ఆవరణలో 73వ వర్ధంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టిశ్రీరాములు తెలుగుజాతికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన ప్రాణత్యాగంతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని, యావత్ తెలుగుజాతికి పొట్టిశ్రీరాములు నిత్యస్మరణీయులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మోహన్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tribute | పొట్టి శ్రీ రాములుకు ఘన నివాళి

