మీ బిడ్డగా ఆదరించి అవకాశం ఇవ్వండి – తీగల రమేష్..

మీ బిడ్డగా ఆదరించి అవకాశం ఇవ్వండి – తీగల రమేష్..
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : నిజాయితీగా ప్రజా సేవ చేయాలనే దృఢ సంకల్పంతో మీ బిడ్డగా వస్తున్న తనను ఆదరించి గెలిపించాలని కాంగెస్ కౌన్సిలర్ అభ్యర్థి తీగల రమేష్ కోరారు. శుక్రవారం అల్లూరిసీతరామరాజు నగర్, తారకరామ కాలనీల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్ మహాశయులను కోరారు. వార్డులో డ్రైనేజీ, రోడ్లతో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరు చేతి గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
