‎న్యాయశాఖలో 30ఏళ్ల అప్రతిహత సేవలు

‎న్యాయశాఖలో 30ఏళ్ల అప్రతిహత సేవలు

పల్లపోలు సురేష్‌కు ఘన సన్మానం
‎‎బాపట్ల కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా సురేష్ స్వచ్ఛంద పదవీ విరమణ


బాపట్ల, ఆంధ్ర‌ప్ర‌భ : ‎బాపట్ల న్యాయస్థానంలో 30 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా విధులు నిర్వహించి, జూనియర్ అసిస్టెంట్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన పల్లపోలు సురేష్ కు శనివారం సాయంత్రం బాపట్ల జ్యుడీషియల్ స్టాఫ్, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. పట్టణంలోని ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా సహచర ఉద్యోగులు మాట్లాడుతూ, ఒకే చోట (32 ఏళ్లు) నిబద్ధతతో, క్రమశిక్షణతో విధులు నిర్వహించడం అరుదైన విషయమని కొనియాడారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు, ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం కార్యవర్గంలో 15 సంవత్సరాల పాటు ట్రెజరర్‌గా సురేష్ అందించిన సేవలను ఫోర్త్ ఎంప్లాయిస్ యూనియన్, జ్యుడిషరీ ఎంప్లాయిస్ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలు సహచర ఉద్యోగులకు ఎంతో స్ఫూర్తిదాయకమని అభినందించారు.

ఈ కార్యక్రమంలో న్యాయశాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఈశ్వర్, ఉపాధ్యక్షులు కె. వెంకటేశ్వరమ్మ, కార్యదర్శి శివప్రసాద్, కోశాధికారి నాగరాజు, సభ్యులు రాజేశ్వరి, రవికుమార్, జాన్ వెస్లీ, ఇతర జ్యుడీషియల్ సిబ్బంది పాల్గొని సురేష్ ను దుశ్శాలువతో సన్మానించి, అభినందనలు తెలియజేశారు.

Leave a Reply