Travels | స్వాములు బస్సు బోల్తా

Travels | స్వాములు బస్సు బోల్తా
Travels | గూడూరు, ఆంధ్రప్రభ : గుంటూరు నుండి శబరిమలకు వెళుతున్న శౌర్యన్ ట్రావెల్ అయ్యప్ప స్వాములు బస్సు ఆదివారం వేకువజామున చిలుకూరు (Chilukuru) మండలం రైటార్ సత్రం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో 35 మంది స్వాములు ప్రయాణిస్తుండగా ఐదు మంది స్వాములకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణం నష్టం జరగకపోవడంతో స్థానిక ప్రజలు, అయ్యప్ప స్వాములు ఊపిరి పీల్చుకున్నారు.
