అభివృద్ధి కార్యక్రమాల అమలులో పారదర్శకత
కర్నూలు అదనపు కలెక్టర్‌గా నూరుల్ కమర్ బాధ్యతలు స్వీకారం
కర్నూలు బ్యూరో, అక్టోబర్ 11 (ఆంధ్రప్రభ) : ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కర్నూలు జిల్లా నూతన అదనపు కలెక్టర్ నూరుల్ కమర్ తెలిపారు. శనివారం ఆయన కర్నూలు జిల్లా నూతన అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో పారదర్శకత, వేగం, సమన్వయాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటానని చెప్పారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా కృషి చేస్తాను అని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా విశేష సేవలందించిన నూరుల్ కమర్‌ను ఇటీవల ప్రభుత్వం కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఆయన జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని, సాంప్రదాయంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలువురు ఉన్నతాధికారులు, విభాగాధిపతులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.