తెలంగాణ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఐఏఎస్ అధికారుల బదిలీ ..

  • ఎన్‌వీఎస్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.
  • హైదరాబాద్ మెట్రోరైల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
  • ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ పదవిలో శృతి ఓజాను తిరిగి నియమించారు.
  • సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా కృష్ణ ఆదిత్య బాధ్యతలు స్వీకరించనున్నారు.
  • అదే విధంగా హెచ్ఎండీఏ సెక్రటరీగా పనిచేస్తున్న కోటం శ్రీవాత్సును బదిలీ చేశారు. ఈ తాజా బదిలీలతో సంబంధిత శాఖల్లో మార్పులు అమలులోకి రానున్నాయి.

Leave a Reply