వరద నీరు తొలగించిన రైల్వే శాఖ
మహబూబాబాద్, ఆంధ్రప్రభ : తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు డోర్నకల్ రైల్వే స్టేషన్ (Dornakal railway station) లో ట్రాక్ పై వరద నీరు నిలిచిపోవడంతో నిన్న రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది నీటిని తొలగించడంతో రాత్రి నుండి రైలు రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం నుండి విజయవాడ నుండి సికింద్రాబాద్ వెళ్లే ప్యాసింజర్, గూడ్సు రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. దీంతో రైల్వే ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

