మూసిన రెండవ విడత వార్డు సభ్యుల శిక్షణ

మూసిన రెండవ విడత వార్డు సభ్యుల శిక్షణ
జుక్కల్, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వార్డు సభ్యులకు జుక్కల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో విడుతలవారీగా శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. రెండవ విడత ఐదురోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. వార్డు సభ్యులు తమ జ్ఞాపకార్థం ఎంపీడీఓ బీ.శ్రీనివాస్,ఎంపీఓ రాము కార్యదర్శులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.ఈ శిక్షణ కార్యక్రమం గ్రామ అభివృద్ధి కోసం తమకు ఎంతో దోహదపడుతుందని వారన్నారు.
