రైలులో ప్రయాణం కొన్నిసార్లు బోరింగ్‌గా అనిపిస్తుందా? ఇకపై కాదు! ఇండియన్ రైల్వేస్ ప్రయాణికుల కోసం ఒక అద్భుతమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. “రైల్ వన్” పేరుతో కొత్త యాప్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.. కాగా, ఈ యాప్‌లో టికెట్ బుకింగ్, పీఎన్ఆర్ స్టేటస్ చెక్, రైలు లైవ్ లొకేషన్ వంటి సాధారణ సర్వీసులే కాకుండా, ఉచితంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు చూడగలిగే ప్రత్యేక ఫీచర్ ఉంది.
ప్రయాణంలో నెట్‌వర్క్ సమస్యలు, డేటా ప్యాక్ ఖాళీ అవ్వడం వంటి ఇబ్బందులు ఇక లేవు – రైలులోని ఫ్రీ వైఫై ద్వారా డైరెక్ట్‌గా OTT కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు.