Tragic incident | అన్నదానం వద్ద విషాదం

Tragic incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. శివాలయంలో అన్నదానం సందర్భంగా ఫిట్స్ రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా బాలుడు గుండెపోటుతో మృతిచెందాడు.

జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన నిషాంత్ (10) అనే బాలుడు మూడో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులతో కలిసి పొలం సమీపంలోని శివాలయానికి వెళ్లాడు.

ఈ సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుండగా నిషాంత్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యలోనే బాలుడు తీవ్ర గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply