నిర్మ‌ల్ జిల్లాలో విషాదం..

వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో వరదలు సంభవించాయి, దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కాగా, ఈ వ‌ర్షాల కార‌ణంగా నిర్మల్ జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది.

వరదలో కొట్టుకుపోయిన వృద్ధురాలు..

నిర్మల్ జిల్లాలోని భైంసా మండలం బిజ్జూరు గ్రామంలో ఊహించని వరదలు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఈ వరద ప్రవాహంలో ఒక వృద్ధురాలు ఎడ్లబండితో సహా కొట్టుకుపోయింది. ఆమెను రక్షించడానికి గ్రామస్థులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఆటంకం ఏర్పడుతోంది. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది.

ఆలయంపై పిడుగుపాటు..

మరోవైపు, వర్షాలతో పాటు మెరుపులు, పిడుగులు కూడా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నిర్మ‌ల్ జిల్లాలోని కొరటికల్ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంపై పిడుగు పడింది. ఈ ఘటనలో ఆలయంలోని విగ్రహాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఇది అరిష్టమని భావించిన గ్రామస్థులు ఆందోళ‌న చెందుతున్నారు.

Leave a Reply