కోటబొమ్మాళి, (ఆంధ్రప్రభ) : శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని కొత్తపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాన వైకుంఠరావు (55) అనే వ్యక్తి మృతి చెందాడు., పోలీసుల కథనం మేరకు వైకుంఠరావు శుక్రవారం సాయంత్రం సరియాపల్లి గ్రామ సమీపంలోని పొలం పనులు ముగించు కొని నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా కొత్తపల్లి గ్రామానికి చెందిన కప్పల రమణ తన బైకు పై వెనుక నుంచి అతివేగంగా ఢీ కొనడంతో వైకుంఠరావు అక్కడకక్కడే మృతి చెందాడు. కప్పల రమణ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. రమణకు టెక్కలి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. మృతుడి భార్య రత్నాలు పిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వి. సత్యన్నారాయణ తెలిపారు.
కోటబొమ్మాళిలో విషాదం..
