టాక్టికల్ అర్బనిజంతో అక్రమణల తొలగింపు..

టాక్టికల్ అర్బనిజంతో అక్రమణల తొలగింపు..
- భవానిపురంలో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్
- నగర పోలీస్ ఆదేశాలతో ప్రత్యేక చర్యలు
- దుకాణదారులకు కౌన్సిలింగ్, పార్కింగ్ నియంత్రణకు స్పష్టమైన సూచనలు
భవానిపురం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఎస్.వి రాజశేఖరబాబు ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ షీరిన్ బేగం సూచనలతో వన్ ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు స్వీయ పర్యవేక్షణలో ..వన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏ.ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. గ్రద్ద బొమ్మ సెంటర్ లో బ్రిడ్జ్ దగ్గర నుండి కాలేశ్వరం మార్కెట్ మీదగా సిటీ టెర్మినల్ వరకు, బి ఆర్ పి ఎస్ రోడ్డు నుండి పోలీస్ స్టేషన్ మీదగా తారాపేట రోడ్డు వరకు రోడ్డుకి ఇరువైపులా ఆక్రమించి వ్యాపారం నిర్వహిస్తున్న వివిధ రకాల తోపుడు బండ్లు, ఇతర వ్యాపారస్తుల వస్తువులను తొలగించడం జరిగింది.
ఈ రోడ్డులో ఐరన్ ,ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు అమ్మే షాపుకి యజమాలను పిలిపించి వారు రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్ అంతరాయం కలిగించి ఏ విధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు ప్రత్యక్షంగా వివరించి కౌన్సిలింగ్ నిర్వహించారు . ఇదే విధంగా కాలేశ్వరరావు మార్కెట్ దగ్గర వివిధ రకాలైన పండ్ల వ్యాపారస్తులను కూడా వారికి కేటాయించిన స్థలాల్లోనే పెట్టే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ శ్రీధర్ ఎస్ఐ ఓంకార్ , ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
