ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో మైనర్ డ్రైవింగ్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో జిల్లా ఎస్పీ ఆది రాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక సామాజిక డ్రైవ్ నిర్వహించారు.

ఈ డ్రైవ్‌లో భాగంగా, పోలీసులు 25 మంది మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, రోడ్డు భద్రత ప్రాముఖ్యత గురించి వారికి వివరించారు.

ప్రతి కేసుపై రూ.5,000 చొప్పున మొత్తం రూ.1.25 లక్షల జరిమానా విధించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మరింత పర్యవేక్షించాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Leave a Reply