Traffic police | హెల్మెట్‌తోనే ప్రాణరక్షణ

Traffic police | హెల్మెట్‌తోనే ప్రాణరక్షణ

  • ద్విచక్ర వాహనదారులతో ముఖాముఖి చర్చ
  • హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించిన పోలీసులు
  • ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తామని ప్రతిజ్ఞ
  • చట్టం కంటే ముందే ప్రాణభద్రతకు ప్రాధాన్యం

Traffic police | విజయవాడ, క్రైమ్, ఆంధ్రప్రభ : విజయవాడ నగర కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆలోచనల మేరకు, ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం సూచనలతో, ట్రాఫిక్ సీఐ కే. కిషోర్ బాబు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ ధారణ ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కల్పించాలనే లక్ష్యంతో 3వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ (ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులను గుర్తించి, ముత్యాలంపాడు రోడ్డులోని ఒక కళ్యాణ మండప సమావేశ మందిరానికి ఆహ్వానించారు. అక్కడ వాహనదారులతో ముఖాముఖి చర్చలు నిర్వహిస్తూ హెల్మెట్ లేకుండా వాహనం నడపడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Traffic police

కొద్ది దూరమే ప్రయాణం చేస్తున్నామని, అసౌకర్యంగా ఉంటుందని, తొందరలో ఉన్నామని వంటి చిన్నచిన్న కారణాలతో హెల్మెట్ ధరించలేదని పలువురు వాహనదారులు తెలిపారు. అయితే ఇవి ప్రాణాల కంటే పెద్ద కారణాలు కాదని, ప్రమాదం ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో ఎవరికీ తెలియదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ చర్చల అనంతరం వాహనదారులందరూ హెల్మెట్ ధారణ అత్యంత అవసరమని అంగీకరించారు.

ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతామని, తమ కుటుంబాల భద్రత కోసం ఈ నియమాన్ని కచ్చితంగా పాటిస్తామని తెలిపారు. అలాగే తమతో పాటు ఇతర వాహనదారులకు కూడా హెల్మెట్ ప్రాముఖ్యతను వివరిస్తూ ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో రైటర్ అజహర్, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం, జకీర్, బాలకృష్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply