traffic flow | స్పెషల్ డ్రైవ్..

traffic flow | స్పెషల్ డ్రైవ్..

  • బెజవాడ రోడ్లపై అక్రమణల తొలగింపు

traffic flow | విజయవాడ (క్రైమ్)ఆంధ్రప్రభ : విజయవాడ నగర రహదారులపై పాదచారులకు, వాహనదారులకు అంతరాయం కలిగిస్తున్న అక్రమంగా ఏర్పాటు చేసిన వస్తువులు, షాపుల(Goods, shops) ముందుంచిన రద్దీని ట్రాఫిక్ పోలీసులు(traffic police) ప్రత్యేక కార్యాచరణలో తొలగించారు.

నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజ శేఖర బాబు ఆదేశాలపై, ట్రాఫిక్ డి.సి.పి షీరిన్ బేగం సూచనలతో, వన్ ట్రాఫిక్ ఏ.సి.పి రామచంద్ర రావు ఆధ్వర్యంలో, వన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్(traffic inspector) ఉమామహేశ్వరరావు, ఆర్.ఎస్.ఐ శ్రీధర్ తదితర సిబ్బంది కలిసి శివాలయం వీధిలో అక్రమ రోడ్ ఆక్రమణలపై డ్రైవ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పాదచారుల రాకపోకలకు, వాహనాల ట్రాఫిక్ ప్రవాహాని(traffic flow)కి అంతరాయం కలిగే విధంగా షాపుల ముందు రోడ్డుపై పెట్టిన వివిధ వస్తువులను తొలగించారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ మార్పు రాలేదని, ఇకపై ఇలాంటి అక్రమ ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులుచెప్పారు. కౌన్సిలింగ్ అనంతరం రోడ్డుపై అస్తవ్యస్తంగా నిలిపిన వాహనాలు కూడా చారు.

Leave a Reply