Traffic duties | మందు బాబులకు ట్రాఫిక్ విధులు

Traffic duties | మందు బాబులకు ట్రాఫిక్ విధులు
- మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినందుకు శిక్ష
Traffic duties | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మద్యం సేవించి వాహనాలు నడుతున్నారా.. కేసులు జరిమానాలతో పాటు ట్రాఫిక్ విధులు కూడా నిర్వహించాల్సి వస్తుంది. మద్యం మత్తులో వాహనం నడుపుతూ పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన కాచాపూర్ గ్రామానికి చెందిన తీగల అజయ్ , చందపల్లికి చెందిన పర్శ తిరుపతి, చిన్నకల్వలకు చెందిన మెరుగు సతీష్, ఖిలవనపర్తికి చెందిన తలారి రాహుల్ లను కోర్టులో హాజరుపరచగా పెద్దపల్లి న్యాయమూర్తి మంజుల రూ.500/- జరిమానా విధించడంతో పాటు, 2 రోజుల పాటు ట్రాఫిక్ విధులు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో భాగంగా ఈ రోజు పెద్దపల్లి పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో విచారణ ఎదుర్కొన్న మందుబాబులకు తీర్పుకు అనుగుణంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ సమక్షంలో కమాన్, బస్టాండ్ కూడలిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ… మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు.
