ఏటూరునాగారం, ఆగస్టు 23 (ఆంధ్రప్రభ) : ట్రాక్టర్ బోల్తా పడి కూలీలకు గాయాలైన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారంలో జరిగింది. వరి నాటు పెట్టేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా (TractorAccident) పడి కూలీలకు గాయాలైన సంఘటన మంగపేట మండలం (Mangapet Mandal) లో చోటుచేసుకుంది.

స్థానికుల వివరాల ప్రకారం మంగపేట మండలంలోని నరసింహ సాగర్ గ్రామం నుండి శనగకుంటకు వరి నాటుకు వెళుతున్న క్రమంలో ట్రాక్టర్ స్టీరింగ్ (Tractor steering) పట్టేయడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12మంది కూలీలకు తీవ్ర గాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఏటూరునాగారం (Eturunagaram) సామాజిక వైద్యశాల తరలించారు.

Leave a Reply