TPCC | ముగ్గుతో సందేశం..

TPCC | ముగ్గుతో సందేశం..

TPCC, ఉట్నూర్, ఆంధ్రప్రభ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలని కోరుతూ, సంక్రాంతి పండుగ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని తన నివాసం వద్ద ప్రత్యేకంగా ముగ్గు వేసి ప్రజలకు సందేశం ఇచ్చారు. గ్రామీణ పేదల జీవనాధారంగా మారిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఈ సందర్భంగా సుగుణక్క ఆందోళన వ్యక్తం చేశారు.

పేద, కూలీల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పోరాటం చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. సంక్రాంతి వంటి పండుగ రోజున ముగ్గు ద్వారా ఇలాంటి సామాజిక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా, గ్రామీణ భారతందేశంలో ఉపాధి హామీ పథకం ఎంత కీలకమో గుర్తు చేయడమే తన ఉద్దేశమని సుగుణక్క తెలిపారు.

Leave a Reply