TPCC | గ్రామాభివృద్ధికి భ‌రోసా

TPCC | గ్రామాభివృద్ధికి భ‌రోసా

TPCC | మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : త‌న‌కు ఓటు వేస్తే అభివృద్ధికి భరోసా కల్పిస్తానని నారమల్ల రాయమల్లు శంకర్ అన్నారు. ఈ రోజు మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి నారమల్ల రాయమల్లు శంకర్ ముమ్మ‌ర ప్ర‌చారం చేస్తున్నారు. ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆమె భరోసా కల్పిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఆమె ప్రచారం చేస్తున్నారు. గ్రామస్తుల అభివృద్ధికి ముందుంటానని ఎన్నికల‌లో ఆశీర్వదించాలని ఆమె పేర్కొన్నారు. త‌న‌కు ఓటు వేస్తే ఐదేళ్లు బాధ్యతాయుతమైన పరిపాలన అందిస్తామని ఆమె తెలిపారు. ఆపదలో ఉన్నవారికి గతంలో నారమల్ల రాయమల్లు శంకర్ దంపతులు అనేక సేవా కార్యక్రమంలో నిర్వహించారు.

Leave a Reply