tough challenge| భారత్ ఎలా ఎదుర్కొంటుందో

tough challenge | భారత్ ఎలా ఎదుర్కొంటుందో
tough challenge | ఆంధ్రప్రభ : విదేశాల్లో భారతీయులపై వ్యతిరేకత క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కెనడాలో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడం, ఎవరు, ఎందుకు అలా చేస్తున్నారో తెలియకపోవడం కలవరపెడుతోంది. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారత వ్యతిరేక విధానాలను అనుసరించడం, భారత వ్యతిరేక ఖలిస్తానీ ఉగ్రవాద అనుకూల వైఖరిని అవలంబించిన విషయం తెలిసిందే. అప్పుడు కెనడా-భారత్ల మధ్య ఎన్నడూ లేని రీతిలో సంబంధాలు దెబ్బతిన్నాయి. కాగా ఆ తరువాత ట్రూడో పదవి నుంచి తప్పుకోవడం, ఆయన స్థానంలో నూతన ప్రధానిగా మార్క్ క్రానీ అధికారం చేపట్టాక పరిస్థితులు చక్కబడటం మొదలైంది.

దౌత్య సంబంధాలు మెరుగుపడటమే కాకుండా అనేక అంశాలపై క్రానీ భారత్తో సానుకూల ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఆశావహ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో హఠాత్తుగా జరిగిన ఇద్దరు భారతీయలను కాల్చి చంపడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అది కూడా దేశ రాజధాని టొరంటోలో ఈ హత్యలు జరిగాయి. హిమాన్షి ఖురానా అనే యువతిని, శివాంక్ అవస్థ అనే యువకుడిని దుండగులు కాల్చిచంపారు. విద్య, ఉద్యోగాల కోసం అమెరికా తరువాత ఎక్కువగా భారతీయులు వెళ్లేది కెనడాకే. భారత వ్యతిరేక భావనలు, దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఆ దేశ మీడియా కూడా హెచ్చరించింది.
tough challenge | భయపెట్టే తరహాలో దాడులు
ఇక మన పొరుగునున్న బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తరువాత భారత వ్యతిరేకత పెల్లుబుకుతోంది. యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం అచేతనత్వం, భారత వ్యతిరేక విధానాలు అందుకు ఆజ్యం పోస్తున్నాయి. భారతీయులైన మైనారిటీలపై.. ప్రత్యేకించి హిందువులపై హత్యాకాండ సాగుతోంది. అది కూడా చాలా అమానుషంగా.. రెచ్చగొట్టే విధంగా.. భయపెట్టే తరహాలో దాడులు సాగుతున్నాయి. గడచిన వారం రోజుల్లో ఇద్దరు హిందూ యువకులను కిరాతకంగా కొట్టి చంపారు. ప్రస్తుతం ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలు, హిందువులపై జరుగుతున్న దాడులను భారత్ ఖండించింది. హత్యోదంతాలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ హింస..మీడియా ప్రచారం అని బంగ్లాదేశ్ చెప్పినంత మాత్రాన ఆ ఘటనలను విస్మరించబోమని, తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.
tough challenge | భారత్ సహకారంతో ఆవిర్భవించి
దాయాది పాకిస్తాన్ మనకు ఎప్పుడూ వ్యతిరేకమే. భారత్ సహకారంతో ఆవిర్భవించిన బంగ్లాదేశ్.. ఇప్పుడు మనపై విషం కక్కడం వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని చెబుతున్నారు. నిజానికి హసీనా అధికారంలో ఉండగా భారత్తో సన్నిహిత సంబంధాలుండేవి. అనేక దీర్ఘకాలిక వివాదాలను ఇరుదేశాలు పరిష్కరించుకున్నాయి. భారత వ్యతిరేక, ఉగ్రవాద సంస్థలపై ఆమె ఉక్కుపాదం మోపారు. అయితే, ఆ శక్తులన్నీ ఇప్పుడు రెచ్చిపోతున్నాయి. ఈ పరిస్థితులను భారత్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
click here to read 15 ఏళ్లు జైలులోనే.. Andhra Prabha SPL Story
